పైలట్ స్మిత్ ధైర్యానికి నా సెల్యూట్:
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. స్మిత్ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి అందరినీ కదిలించాయని, గాయపడినా ఇతరులను కాపాడాలనే ఆయన సంకల్పం చెక్కుచెదరలేదని ప్రశంసించారు. స్మిత్ శౌర్యం, తక్షణ స్పందన ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడాయని, ఆయన ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. స్మిత్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
Post Views: 14








