త్వరలో సీనియర్ సిటిజన్స్ కు ఉచిత బస్సు ప్రయాణం

 

హైదరాబాద్ : సీనియర్ సిటిజన్స్ కు ఉచిత బస్సు పాసులు ఇచ్చే అంశా న్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురువారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సంద ర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాసులు అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

 

అయితే అర్హతలు, స్కీమ్ నిబంధనలు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారు. ఉచిత బస్ పాస్‌లు అందుబాటులోకి వస్తే పురుషులకూ లబ్ధి చేకూరనుంది.

 

ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్ ల సౌకర్యా న్ని అందుబాటులోకి తీసుకొస్తే 60ఏళ్లు పైబడిన, వృద్ధ పురుషులు ఉచితం గా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram