కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మండల అఖిలపక్ష సమావేశం..
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అఖిలపక్షాలు ఐక్యంగా పోరాడాలి.
ఈ నెల 8న జిల్లా కేంద్రంలో జరిగే “Save Democracy March past”ను విజయవంతం చేయాలి..
కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పిలుపు
కరకగూడెం : అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు సయ్యద్ ఇగ్బాల్ హుస్సేన్, కొమరం కాంతారావు, వంగరి సతీష్ లు మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల పేరుతో కోట్లాది మంది అర్హులైన ఓటర్లను చిన్నచిన్న తప్పుల కారణంగా ముస్లిం క్రిస్టియన్ దళితులను టార్గెట్ చేసుకొని ఓట్ల రద్దు చేస్తున్నారని ఆరోపించారు బీహార్ పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ముస్లిం క్రిస్టియన్ ఓట్లనే టార్గెట్ చేసి రద్దు చేశారని కేంద్ర బిజెపి కనుసనల్లో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని తక్షణమే ఎలక్షన్ కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ లోనే అవినీతి ఆరోపణల చర్చ తీవ్రంగా కొనసాగుతుందని అర్హులైన ఓటర్లను ఎలాంటి కారణాలతోనూ తొలగించకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తక్షణమే సర్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఈ నెల 8వ తేదీన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే “Save Democracy March ” ప్రజాస్వామ్య పరిరక్షణ మార్చ్ ఫాస్ట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఈ మార్చ్ ఫాస్ట్ కు మండలం నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షాల జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు ,ఉపాధ్యాకులు కల్తీ విజయ్,సర్పంచు లు, ఎర్రం పొట్టయ్య, తోలెం రమేష్, ఎల్లబోయిన ముత్తమ్మ, తోలెం సావిత్రి, బాడిష పార్వతి, ఉపసర్పంచ్ గాంధర్ల రామనాథం, మాజీ ఉప సర్పంచ్‌లు కొమరం వెంకటేశ్వర్లు, బాడిష లక్ష్మీనారాయణ CPM మండల నాయకులు M. అఖిల్ , sc సెల్ అధ్యక్షులు జాడి శ్రీను, సీనియర్ నాయకులు అత్తే సారయ్య ,మండల కాంగ్రెస్ నాయకులు పడిగ సమ్మయ్య, చందా నాగేశ్వరరావు, షేక్ రఫీ, తోలెం కృష్ణ, గొగ్గలి రవి,అఖిలపక్ష నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్, CPI, CPM పార్టీల నాయకులు కార్యకర్తలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు…








