ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం..
తెలంగాణ: సికింద్రాబాద్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజన సమయంలో విరన్ జైన్ అనే ఆరో తరగతి విద్యార్థి చపాతి రోల్ చేసుకుని తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. చపాతి గొంతులోనే ఇరుక్కుపోయి శ్వాస ఆడక పోవడంతో విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. హుటాహుటిన పాఠశాల యాజమాన్యం ప్రైవేటు ఆసుపత్రికి తరలించే లోగానే మార్గమధ్యంలో బాలుడు చనిపోయాడు. విరన్ జైన్ ఆకస్మిక మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Post Views: 42









