అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠా అరెస్ట్ 

గోల్డెన్ న్యూస్/ ఆదిలాబాద్ /

 

మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పశువులను అపహరించి మహారాష్ట్ర వధశాలలకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ఘరానా ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు.

 

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మొహమ్మద్ షాహిద్ హబీబ్ ఖాద్రి, ఆలం షేక్ అనీష్, ఫర్మాన్ సబీర్ షేక్, షేక్ తబాస్ షకీల్, వసీం ఖురేషీలను అరెస్ట్ చేశారు.

 

పరారీలో ఉన్న నిందితులు: రహీమ్, మొండ్ ముర్తుజా @ అల్తాఫ్, అజీమ్ రౌఫ్ గాజీ @ అజ్జు, నబీ బిల్డర్, తౌకీర్, పాపు తాండా, బాబు @ సయ్యద్ సమీర్, ఖయ్యూమ్ బటారియా.

 

నిందితుల వద్ద నుండి ఒక కారు, 5 సెల్ ఫోన్లు, నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం.

 

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న పరారీ లో ఉన్న ముఠా సభ్యులపై ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

 

పశువుల దొంగలపై ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతుంది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram