కరాకాస్ దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను వరుస భారీ భూకంపాలు వణికించాయి. బుధవారం సాయంత్రం స్థానిక కాలమానం ప్రకారం రెండు శక్తివంతమైన భూకంపాలు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో సంభవించాయి. మొదటి భూకంపం తీవ్రత 7.1గా నమోదవగా, వెంటనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో రాజధాని కరాకాస్ తో పాటు పలు రాష్ట్రాల్లో భవనాలు కుప్పకూలాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదు కాగా, రెండోది మరింత తీవ్రతతో 7.5గా నమోదైనట్లు యూఎస్ జియోలజికల్ సర్వే తెలిపింది. దేశ కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది.
Post Views: 5








