విజేతలకు బహుమతులు అందజే
తాడ్వాయి : యువత కేవలం చదువులకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక మరియు సామాజిక రంగాల్లో ముందంజలో ఉండాలని కరకగూడెం,తాడ్వాయి ఎస్సైలు పి వి నాగేశ్వరరావు,మధుకర్ పిలుపునిచ్చారు.
దసర పండుగా సందర్భంగా తాడ్వాయి మండలంలోని రంగాపురం పాఠశాల మైదానంలో సామ్మక్క-సారలమ్మ తాడ్వాయి,ఏటునాగారం, మంగపేట,కరకగూడెం,పినపాక,మణుగూరు,ఆళ్ళపల్లి,గుండాల,మండలాల స్థాయి విపిఎల్-6 ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిశాయి.ఆదివారం
విజేతలకు కరకగూడెం,తాడ్వాయి ఎస్సైలు పి వి నాగేశ్వరరావు,మధుకర్ గార్ల చేతుల మీదగా నవీన్-11 జట్టుకు 25,116/-, బ్లూ స్టార్-11 జట్టుకు 15,116/- నగదు తోపాటు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లడుతూ…క్రీడలు యువతీ,యువకులలో క్రమశిక్షణను,పట్టుదలను పెంపొందిస్తాయని, తద్వారా వారు భవిష్యత్తులో దేశ ప్రగతికి తోడ్పడేలా అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు.అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో అణిముత్యం లాంటి క్రీడాకారులు ఉంటారని,ఐపీఎల్ తరహాలో పట్టణాల్లో జరిగే ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్ గ్రామీణ ప్రాంతంలో నిర్వహించి,క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడం అభినందనీయం అని పేర్కొన్నారు.విజేతలకు బహుమతులు కార్యక్రమానికి ఆహ్వానించిన మేనేజ్మెంట్ వారిని వారు అభినందించారు.అనంతరం టోర్నీకి సహాయం చేసిన ఊసం ఉపేంద్ర,గోగు శ్రీను,ఆర్మీ విజయ్, అథితులను టోర్నీ నిర్వహకులు ఘనంగా సత్కారించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పినపాక హౌసింగ్ ఏఈ గుమ్మడి వినీత, అనంతారం సర్పంచ్ పాయం కృష్ణవేణి, నర్సాపురం మాజీ సర్పంచ్ మంకిడి నరసింహ స్వామి, ఇర్ప సూర్యం,గుమ్మడి ముత్తయ్య,సీనియర్ ఫ్లేయర్స్ జాడి రాకేష్,రియాజ్,ఎట్టి ప్రసాద్, టోర్నీ నిర్వహకులు గుడ్ల రంజిత్,యంగళి గోపి,పాయం సుధాకర్,ప్రశాంత్,సతీష్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.








