బస్సులో నుంచి కండక్టర్ను నెట్టిన మహిళపై కేసు నమోదు

అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలో ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో జరిగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో కండక్టర్ ను బస్సులో నుంచి ఓ మహిళ నెట్టివేయడంతో, కండక్టర్ కాళ్లపై నుంచి బస్సు చక్రాలు వెళ్లి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు బానోత్ మౌనికపై కేసు నమోదు చేసినట్లు అశ్వాపురం సీఐ వెల్లడించారు. టికెట్ వివాదమే ఘటనకు కారణమని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram