కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

అత్త కోడలు మధ్య వివాదం – ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కోడలు.

గోల్డెన్ న్యూస్ సూర్యపేట,:  హుజూర్నగర్ పట్టణలోని యాదవ్ బజారులో అత్తా, కోడలు మధ్య తలెత్తిన వివాదం వివాహిత ఆత్మహత్యకు దారి తీసింది. సంతానం కలగటం లేదని వేధిస్తూ భర్త, అత్త ఇద్దరూ కలిసి కొట్టారని మనస్తాపం చెందిన కోడలు బొమ్మోతు లక్ష్మి, ఇంట్లో  ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం సూర్యాపేట యాదవ్ యాదవ బజారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బొమ్మోతు నరేశ్తో పాలకీడు మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన లక్ష్మికి 6 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. నరేశ్ రైస్ మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. లక్ష్మి కి చాలా కాలంగా సంతానం కలగకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం ఉదయం కూడా భర్త, అత్త లక్ష్మితో గొడవపడ్డారు. దీంతో మనస్తాపం గురైన లక్ష్మి… ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అత్తింటి మీద దాడికి దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram