ప్రజా పాలన విజయోత్సవాలు

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో పాల్గొన్న పినపక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు 

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

గోల్డెన్ న్యూస్ కరకగూడెం : అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని పినపాక శాసనసభ్యులు అన్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దాదాపు 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా,తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మొత్తంగా 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది. ఈ నిధులను విడుదల చేయడంతో పాటు పినపాక నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు, ముంద చేసిందన్నారు.. అంతేకాకుండా మహిళల కోసం ఉచిత బస్సు, గృహలక్ష్మి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణం, ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిందన్నారు. రైతే రాజు అని ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భంలో రైతు పండుగ చేసుకుంటున్నం అన్నారు, పినపాక నియోజకవర్గం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని వాటిని విడతల వారీగా వాటిని పూర్తి చేస్తామన్నారు, ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అర్హులైన వారికి కచ్చితంగా అన్నారు, అంతే కాకుండా ఏజెన్సీలో ఐటీడీఏకు ప్రత్యేక ఇల్లులు ఇస్తుందని  తెలిపారు, ఒక్క సంవత్సరంలోనే ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం  నాలుగు సంవత్సరాలలో మరింత అభివృద్ధి చేస్తుందో ప్రజలు గ్రహించాలని అన్నారు, కాంగ్రెస్ ను నమ్మి అధికారం కట్ట పెట్టినందుకు, ఎల్లప్పుడూ నీకు తోడు ఉంటుందని అన్నారు, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలన్న నేరుగా నన్ను కలవచ్చాను పేర్కొన్నారు, రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఎర్ర సురేష్, తొలెం నాగేశ్వరావు, పోలేబోయిన తిరుపతయ్య, నేతాజీ, మహిళా నాయకురాలు పోలె బోయిన శ్రీవాణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram