అంబులెన్స్‌ డ్రైవర్‌కు జైలుశిక్ష

మద్యం సేవించి అంబులెన్స్ నడుపుతూ-పోలీసులకు పట్టుబడ్డ డ్రైవర్.

గోల్డెన్ న్యూస్ నిజామాబాద్: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ  అంబులెన్స్ డ్రైవర్ కు జైలు శిక్ష పడినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి బుధవారం ప్రకటన విడుదల అయ్యింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నిఖిల్‌ సాయి చౌరస్తా వద్ద ఈనెల 2వ తేదీన ట్రాఫిక్ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ్ వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా మొహమ్మద్‌ ఇసాక్‌ అనే అంబులెన్స్ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వెంటనే బ్రీత్‌ అనలైజర్‌తో చెక్‌ చేయగా అతను మద్యం సేవించినట్లు నిర్దారణ అయింది. వెంటనే ఇన్స్పెక్టర్‌ ప్రసాద్‌ మరియు సిబ్బంది అతనిని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి అంబులెన్స్‌ను సీజ్‌ చేశారు..డ్రైవర్‌ను సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచగా మేజిస్ట్రేట్‌ అహ్మద్‌ మోయిద్దీన్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ కు మూడు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన మిగతా 14 మంది వ్యక్తులకు రూ.38 వేలు జరిమానా విధించినట్టు పోలీసువర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram