అపరిచిత వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలి
ఎస్ఐ రాజ్ కుమార్
గోల్డెన్ న్యూస్ పినపాక: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏడుళ్ల బయ్యారం ఎస్ఐ రాజకుమార్ ఆధ్వర్యంలో జానంపేట వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..పరిచిత వ్యక్తులు సంచరించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మావోయిస్టులకు ఎవరు సహకరించవద్దని సూచించారు..
Post Views: 55









