సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్య.. నిలిచిన రైళ్లు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్లే వందే భారత్, దిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో సమస్యతో అనంతరం వీటిని రైల్వే అధికారులు స్టేషన్ నుంచి పంపించగా..ఉప్పల్ స్టేషన్లో సింగరేణి ప్యాసింజర్ 20 నిమిషాలుగా నిలిచిపోయింది. మెయిన్ లైన్లో గూడ్స్ రైలు కూడా ఆగింది. మరోవైపు సిగ్నలింగ్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్వోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోక, ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Post Views: 34









