గోల్డ్ న్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో పులి జాడ కోసం అటవీ అధికారులు వెతుకున్నారు. ములుగు జిల్లాలో చలి క్రమంగా పెరుగుతుండడంతో ఇటు వచ్చినట్లు తాడ్వాయి అటవీ అధికారులు చెబుతున్నారు. గురువారం కరకగూడెం అటవీ ప్రాంతం మీదుగా గుండాల వైపుకు పెద్దపులి ప్రయాణం సాగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. కాగా గతంలో గుండాల, పాండవులు గుట్ట, ఇల్లందులో పెద్ద పులులు సంచరించేవని స్థానికులు చెబుతున్నారు. 2000 సం. నవంబర్లో ఈ ప్రాంతంలో పెద్ద పులి ఆవులపై దాడి చేసిందన్నారు. రెండు దశాబ్దాల తర్వాత 2020లో ఒకసారి, 2022లో మరోసారి సంచరించాయన్నారు. మళ్లీ రెండేళ్ల తర్వాత పులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు…
Post Views: 61









