గోల్డెన్ న్యూస్/కరకగూడెం : న్యాయం చేయాలంటూ మృతదేహంతో బాధితులు రాస్తారోకో చేశారు.ఇందుకు సంబంధించిన వివరాలు స్థానికుల కథనం ప్రకారం..
కరకగూడెం మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన దోమల.ప్రణయ్108 వాహనంలో ఈఎంటి గా విధులు నిర్వహిస్తున్నడు, డిసెంబర్ 30 పురుగుల మందు సేవించి ఆరోగ్య పరిస్థితి విషమించగా ఉండడంతో చికిత్స కోసం ఖమ్మంలోని ప్రవేటు హాస్పటల్ చేర్పించారు. చికిత్సా పోందుతు గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడు పినపాక మండలంలోని సహచర ఉద్యోగి వద్ద నుండి మధ్యవర్తిగా ఉండి కరకగూడెం గ్రామంలోని కొందరికి అప్పు ఇప్పించాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇవ్వాలని ప్రణయ్ ని ఇబ్బంది పెడుతూన్నాడు. ఈ క్రమంలోనే మృతుడి ద్విచక్ర వాహనం లక్కోన్నడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తి వేధింపుల వల్లనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బాధితులను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని బంధువులు కరకగూడెంలో ప్రధాన కూడలిలో శుక్రవారం రాస్తారోకోకుదిగా రు. సుమారు 40నిమిషాలకు పైగా ఆందోళన చేయడంతో ఎస్ఐ రాజ్ కుమార్ వచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు..









