సేంద్రియ సాగు విధానంపై.. మిర్చి రైతును అభినందించిన ఎమ్మెల్యే ఆయం వెంకటేశ్వర్లు.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు యారం లక్ష్మిరెడ్డి విషపూరిత మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో మిర్చి పంటలు సాగు చేశాడు. శనివారం బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా పినపాక శాసనసభ్యులు పాయం మిర్చి పంటను పరిశీలించారు. ఎటువంటి విషపూరిత మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో మిర్చి పంటను సాగు చేసిన రైతు లక్ష్మీరెడ్డి ని శాసనసభ్యులు అభినందించారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి ,బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 51









