గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ /అల్పపీడన ప్రభావం తగ్గి దూరమైన నేపథ్యంలో, ఈరోజు తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలైన సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ స్వల్ప వర్షాలు లేదా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
ప్రజలు బయటకు వెళ్లే సమయంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Post Views: 8








