నిజాయితీ చాటుకున్న కండక్టర్

కల్లూరు  : ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన ఓ కండక్టర్ తన నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణికురాలు మర్చిపోయిన పర్సు, అందులో ఉన్న రూ.10 వేల నగదుతో సురక్షితంగా యజమానికి  అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.

 

వేరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం వి.ఎం.బంజర నుంచి కల్లూరుకు TS 04 UE 2229 నంబర్ గల ఎక్స్ప్రెస్ బస్సులో కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామానికి చెందిన గుంజి సత్యవతి ప్రయాణించారు. కల్లూరులో బస్సు దిగే సమయంలో తన వద్ద ఉన్న కవర్ను పొరపాటున బస్సులోనే మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయారు.

 

బస్సు కల్లూరు దాటి ముందుకు వెళ్లిన అనంతరం టికెట్లు పరిశీలించేందుకు వెనుక వైపు వెళ్లిన కండక్టర్ బి. నరేష్ కు సీటు కింద ఓ కవర్ కనిపించింది. వెంటనే దానిని తీసి పరిశీలించగా అందులో రూ.10 వేల నగదుతో కూడిన పర్సు ఉన్నట్లు గుర్తించారు. అందులో ఉన్న ఆధార్ కార్డు కార్డుకు లింక్ అయినా ఫోన్ నంబర్ ఆధారంగా పర్స్ ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పర్సు యజమాని గుంజి సత్యవతిని ఫోన్ ద్వారా సంప్రదించి విషయం తెలియజేశారు. అనంతరం ఖమ్మం నుంచి తిరుగు ప్రయాణంలో కల్లూరు బస్టాండ్ వద్ద కండక్టర్ కంట్రోలర్ ఆర్.వి. రావు సమక్షంలో రూ.10 వేల నగదుతో కూడిన పర్సును ఆమెకు తిరిగి అందజేశారు.

 

తాను పోగొట్టుకున్న పర్సు, అందులోని నగదు తిరిగి లభిస్తాయని అసలు ఊహించలేదని సత్యవతి ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో బాధ్యతగా వ్యవహరించి తన సొమ్మును భద్రంగా తిరిగి అందించిన కండక్టర్ బి. నరేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Facebook
WhatsApp
Twitter
Telegram