విద్యార్థులకుకంటి వైద్య పరీక్షలు

పినపాక : జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పినపాక నందు ఈరోజు పాఠశాల విద్యార్థులకు కంటి వైద్య శిబిరం నిర్వహించటం జరిగినది.ఈ కంటి వైద్య శిబిరములో సుమారు 135 మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు పినపాక ఆప్తాల్మిక్ ఆఫీసర్ సంజీవరావు కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ కంటి వైద్య శిబిరాన్ని పినపాక మండల తహసీల్దార్ శ్రీనివాస రెడ్డి ప్రారంభించినారు. ఈ వైద్య శిబిరంలో ఒక విద్యార్థికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించడం జరిగినది.ఈ వైద్య శిబిరములో జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ పినపాక హెడ్మాస్టర్ రామిరెడ్డి పినపాక మండల నాయబ్ తహసిల్దార్ రమేష్, పినపాక మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్, పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది అరుణ్ బాబు, ప్రవీణ్ కుమార్, నరసింహ, వెంకన్న పాల్గొనినారు.

Facebook
WhatsApp
Twitter
Telegram