లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!

రూ.40 వేల అప్పు.. అసభ్యకర బెదిరింపులతో తీవ్ర మనస్తాపం..

కుటుంబ సభ్యులకు నగ్న చిత్రాలు పంపుతామంటూ వేధింపులు! 

 

హైదరాబాద్ : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అప్పు తిరిగి చెల్లించాలంటూ నిర్వాహకులు చేసిన వేధింపులు, అసభ్యకర బెదిరింపులు తట్టుకోలేక ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

హైదరాబాద్‌లోని కొండాపూర్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీను (31) నాలుగు నెలల క్రితం ఓ లోన్ యాప్ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అయితే, నిర్ణీత సమయంలో రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. రుణం చెల్లించాలంటూ అసభ్యకరంగా దూషించడంతో పాటు, కుటుంబ సభ్యులకు నగ్న చిత్రాలు పంపుతామంటూ బెదిరించినట్లు సమాచారం.

 

ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram