కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

⇒ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

⇒ రేగా సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్,పలువురు నాయకులు

 

కరకగూడెం : కాంగ్రెస్ ప్రభుత్వం ‘యువజన డిక్లరేషన్’ లో ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ వంటి 24 కీలక హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతను ఘోరంగా వంచించిందని ధ్వజమెత్తారు.అందుకే రాష్ట్రవ్యాప్తంగా యువత కాంగ్రెస్ పాలనపై తిరగబడుతోందని,యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందంటూ కరకగూడెం మండల కల్వలనాగరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ కునుసోత్ సాగర్,తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీలో చేరారు.పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో వీరంతా గులాబీ కండువా కప్పుకున్నారు.రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యువకులు పార్టీలో చేరికతో బీఆర్ఎస్ మరింత బలోపేతం కానుందని,రానున్న రోజుల్లో యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.పార్టీలో చేరిన యువ నాయకులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని రేగా భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,గ్రామ కమిటీ అధ్యక్షులు పులి శ్రీధర్,మాజీ సర్పంచ్ భూక్య భాగ్యలక్ష్మి-ఆర్జున్,సర్పంచులు కొమరం సత్యనారయణ,వట్టం సందీప్,తోలెం బాలరాజు,మాజీ సర్పంచులు ఊకే రామానాథం,పాయం నర్సింహారావు,కొమరం రాంబాబు,బైరిశెట్టి చిరంజీవి,రేగా సత్యనారయణ,తోలెం రామారావు,పాయం క్రిష్ణ,పోలెబోయిన రంగయ్య,సుతారి నాగేష్,లెనిన్,సతీష్,ప్రభాకర్,రవి,ప్రవీన్, తదితరులు పాల్గోన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram