బూర్గంపాడు : అఖిలభారత 36వ రైతు మహాసభలు జయప్రదం చేయాలని రైతు మహాసభలో పోస్టర్లు లక్ష్మీపురం సెంటర్లో మంగళవారం బూర్గంపాడు సిపిఎం పార్టీ మండల కమిటీ ఆవిష్కరించింది
ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1936లో అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ ఆవిర్భవించి నేటికీ 90 సంవత్సరాలు అవుతున్నది ప్రపంచం గుర్తింపు పొందిన వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటాల పురిటి గడ్డ నల్లగొండలో మొట్టమొదటిసారిగా అఖిల భారత కిసాన్ సభ 36వ రైతు జాతీయ మహాసభలు నవంబర్ 15,16,17,18 లో జరుగుతున్నాయి నవంబర్ 15న లక్షలాది మంది రైతులతో భారీ ప్రదర్శన బహిరంగ సభను నిర్వహిస్తున్నారు .
ఈ మహాసభలకు దేశం నలుమూలల నుండి వస్తున్నారు ఈ సభలు జయప్రదం చేయాలని నవంబరు 15న బహిరంగ సభకు బూర్గంపాడు మండలం నుండి పెద్ద సంఖ్యలో కదిలి రైతులు వ్యవసాయ కార్మికులు కార్మిక సంఘాలు సిపిఎం పార్టీ శ్రేణులు సానుభూతిపరులు అందరూ పెద్ద ఎత్తున 15వ తారీకు బయలుదేరి నల్గొండ పట్టణానికి చేరాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు, ఎస్ కే అబీద, గుంటక కృష్ణ, దుర్గారావు నాగేశ్వరావు, అశోక్, వీరన్న,తదితరులు పాల్గొన్నారు








