గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో కోర్టు భవనం మూడో అంతస్తులోని ఒక గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. కొద్ది సేపట్లోనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో అవి ఇతర అంతస్తులకు వ్యాపించకుండా నిలువరించగలిగారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
Post Views: 10








