గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక నుండి ఇరవేండి మణుగూరు వెళ్లే రోడ్డు వెంటనే నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..ఆ రోడ్లో స్కూలు బస్సులు గాని పెద్దపెద్ద వాహనాలు 18 టైర్లు బండ్లు మోటార్ సైకిల్ ట్రాక్టర్లు జామేల్ కర్రలతో భారీ ఎత్తున ఆ రోడ్లో తిరుగుతున్నాయి కానీ ఆ రోడ్డు గతంలో 2025లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై నాటువైసు నిరసన తెలియజేస్తే తాత్కాలికంగా రోడ్డు పనులు చేశారు .
కానీ ఈ సంవత్సరం మళ్లీ అదే పరిస్థితి రోడ్డు మొత్తం వర్షానికి బీభత్సంగ గుంటలు బడి పెద్దపెద్ద నీటి చెరువుల్లాగా తయారై
సాయంత్రం అయితే చాలు ఆ రోడ్లో బండ్ల పైన పోయే పరిస్థితి లేదు గొంతులు పడి కాలు చేతులు విరిగిన పరిస్థితి ఉంది
అందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో శనివారం 4 న పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది వెంటనే ప్రభుత్వం గానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరావు వెంటనే జోక్యం చేసుకొని ఆ రోడ్డుని సిసి రోడ్డుగా నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీ కోరుతుంది
ఈ నెలాఖరుకల్లా రోడ్డు నిర్మాణం చేయని యెడల పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించి రోడ్డుని దిగ్బంధం చేసి రాస్తారోకో చేస్తామని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని అధికారుల్ని హెచ్చరిస్తున్నాం
ఆర్ అండ్ బి అధికారులు చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా ఉంది
అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొని సిసి రోడ్డు సారపాక నుండి మణుగూరు దాకా పోయే రోడ్డుని నిర్మాణం చేపట్టాలని డిమాండ్
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు SK పాషా, వై అప్పారావు, ఆదురి నరసింహారావు, బత్తుల గోపాలరావు ,బోళ్ళ ధర్మారావు, కన్నయ్య, సురేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు








