గోల్డెన్ న్యూస్ / కృష్ణాజిల్లా / కృష్ణాజిల్లాలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గూడూరు మండలం పోసినవారి పాలెం పంచాయతీ పరిధిలోని పొట్టేలగుంటపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. అత్త రజని (60, కుమార్తె గౌరి (40), కోడలు మధు(35) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మహిళల మృతికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన గూడూరు పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 7








