గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఆదివాసీ హక్కుల ఉద్యమ నాయకుడు చందా లింగయ్యకు గౌరవ డాక్టరేట్ లభించింది.సామాజిక సేవ, నాయకత్వ రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్స్‌లెన్స్ చందా లింగయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ అంతర్జాతీయ గుర్తింపు పట్ల ఆయన అభిమానులు, అనుచరులు, పలువురు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
Post Views: 10








