కూలి పని ఇప్పిస్తానని తీసుకెళ్లి బంగారం లాక్కుని మహిళను బావిలో తోసేసిన దుండగుడు

కరీంనగర్ జిల్లాలో దారుణం

కూలి పని ఇప్పిస్తానని తీసుకెళ్లి బంగారం లాక్కుని మహిళను బావిలో తోసేసిన దుండగుడు

21 గంటలు బావిలోనే ఉండి, ప్రాణాలతో బయటపడ్డ మహిళ

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కిసాన్ నగర్ ప్రాంతంలో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గంగాధర లక్ష్మీ(55) అనే మహిళ

ఎప్పటిలాగే లక్ష్మీని కూలి అడ్డ వద్ద దిగబెట్టిన కొడుకు సందీప్

కూలి పని ఉందని ఆమెతో ఒప్పందం చేసుకుని, నుస్తులాపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లి, ఉదయం 11 గంటల సమయంలో మహిళ వద్ద ఉన్న అర తులం బంగారం, 4వేల నగదు లాక్కుని ఆమెను బావిలో తోసేసిన గుర్తు తెలియని వ్యక్తి

మహిళ బావిలో ఉన్న తాడు పట్టుకుని పైకి రావడం గమనించి, తాడును కోసేసి వెళ్ళిపోయిన కిరాతకుడు

బావిలో ఈదుకుంటూ, మోటారుకున్న పైపును పట్టుకుని, ప్రాణాలు కాపాడుకున్న బాధితురాలు

రాత్రి అవుతున్నా తల్లి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కొడుకు సందీప్

సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నుస్తులాపూర్ గ్రామం అంతా గాలించినా లభించని మహిళ ఆచూకీ

మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బావి దగ్గరికి వెళ్ళిన భూ యజమానికి కేకలు వినపడడంతో తొంగి చూసి, లోపల మహిళ ఉందని సమాచారం ఇవ్వడంతో ఆమెను బయటికి తీసిన గ్రామస్తులు

ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

Facebook
WhatsApp
Twitter
Telegram