భార్యతో వీడియో కాల్‌ మాట్లాడుతూ.. రైలు కింద పడి భర్త ఆత్మహత్య

గోల్డెన్ న్యూస్ /వరంగల్‌ / వరంగల్‌ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆదివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాజేశ్‌ నాయక్‌ (45) అనే వ్యక్తి భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

సమాచారం ప్రకారం, రాజేశ్‌ నాయక్‌ రైల్వే పట్టాలపై నిలబడి ఎదురుగా వేగంగా వస్తున్న రైలును వీడియో కాల్‌లో భార్యకు చూపించాడు. ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే రైలు కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో భార్య తీవ్ర షాక్‌కు గురైంది.

 

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

ప్రాథమిక సమాచారం ప్రకారం, కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram