తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు.!

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది, ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్, కార్పొరేషన్ లిమిటెడ్,టీజీ బీసీఎల్,కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది..

 

తెలంగాణలో ఇప్పటికే పలు కంపెనీల లిక్కర్ అమ్మకాలు సాగుతుండగా, మరిన్ని కొత్త కంపెనీల లిక్కర్ ను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు కొత్త బ్రాండ్స్ కంపెనీ ల నుంచి ధరఖాస్తులను ఆహ్వానించింది. అన్ని అనుకూలిస్తే మరో నెలలోనే కొత్త బ్రాండ్లు తెలంగాణలో కొలువుతీరనున్నాయి.

 

ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు బ్రాండ్లకు అనుమతులు ఇవ్వను న్నారు. తెలంగాణలో లేని విదేశీ, దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్ల అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి టీజీ బీసీఎల్ దరఖాస్తులను స్వీకరించనుంది.

 

టీజీబీసీఎల్ లో రిజిస్టర్ కానీ కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతు న్నట్లుగా మద్యం అమ్మకా లపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తులో జతప రచాలని టీజీ బీసీఎల్ కోరింది.

 

తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తు లను అమ్ముకోవడానికి టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇవ్వడం జరిగింది. కానీ కొత్త కంపెనీలపై పలు ఆరోప ణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసిన విషయం విధితమే.

Facebook
WhatsApp
Twitter
Telegram