పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఐదుగురు అరెస్టు, రూ.7,500 నగదు.. 5 ద్విచక్ర  వాహనాలు స్వాధీనం.

గోల్డెన్ న్యూస్/కరకగూడెం : పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న  ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కరకగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలం  పరిధిలోని గుబ్బల మంగమ్మ  గుడి సమీపంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు విశ్వసిన్య సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. అక్కడ పేకాడుతున్న బట్టుపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టుచేసి వారి నుంచి రూ.7,500 నగదు, ద్విచక్ర వాహనాలు  స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram