గోల్డెన్ న్యూస్ : సుక్మా : భద్రతా బలగాలను మట్టు పెట్టేందుకు కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి రహదారిపై మావోయిస్టులు అమర్చిన ఐదు కేజీల ఐ ఈ డి బాంబును భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. సీఆర్పీఎఫ్ 228 బెటాలియన్ ఆధ్వర్యంలో జవాన్లు మావోయిస్టుల కోసం అడవులను గాలిస్తుండగా తనిఖీలలో భాగంగా రహదారిపై బాంబు ఉన్నట్లు గుర్తించి అక్కడికక్కడే పేల్చివేశారు. బాంబు పేలడంతో రహదారిపై ఐదు అడుగులు గొయ్యి ఏర్పడింది. బాంబు ను గుర్తించకపోతే బలగాలకు భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు.
Post Views: 61









