గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : జూలూరుపాడు మండలం వినోబా నగర్ సమీపంలో గురువారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు, తల్లాడ వైపు నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న మరో కారు వినోబా నగర్ గ్రామం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొత్తగూడెం సింగరేణి సంస్థకు చెందిన ముగ్గురు ఉద్యోగులు ప్రశాంత్, శ్రీనివాస్, తిరుమలరెడ్డి గాయపడ్డారు. వీరిని కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన మరో కారులో వైరా మండలం స్నానాల లక్ష్మీపురం శివాలయం ఈఓ హరిచంద్ర శేఖర్ ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు..
Post Views: 48









