గోల్డెన్ న్యూస్/ చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి.భానుమతి అన్నారు. చంద్రుగొండలోని కస్తూరిబా విద్యాలయం, గిరిజన ఆశ్రమ పాఠశాల, ఎస్సీ బాలుర వసతిగృహాలను మంగళవారం ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా వసతి గృహాల్లో సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వసతిగృహాల్లోని పలుఫైళ్లను తనిఖీ చేశారు. మెనూ ప్రకారంభోజనం పెట్టాలని, వసతిగృహాలన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మూత్రశాలలో మరుగుదొడ్లు సరిపోవడం లేదని విద్యర్థులు చెప్పారు. ఈ విషయంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. వంట చేసే గదులు శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు డిప్యూటీ లీగలెయిడ్ కౌన్సిల్ నిరంజన్రావు, సీనియర్ న్యాయవాధి రాజమల్లు పాల్గొన్నారు. కేజీబీవీ ప్రత్యేకాధికారి కవిత, గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రత్యేకాధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.
Post Views: 37









