ప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకోవాలి

 ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

    కరకగూడెం ఎస్ఐ ఏ రాజేందర్.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం :  ప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకున్నప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కరకగూడెం ఎస్ఐ రాజేందర్ అన్నారు. మంగళవారం  ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో మండల పరిధిలోని  వలస ఆదివాసీ  గ్రామమైన అంగోరు గూడెం లో నిర్వహించిన  దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై  ముఖ్యఅతిథిగా పాల్గొని  50 కుటుంబాలకు దుప్పట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ….సమాజ సేవలో ఎనలేని సంతృప్తి దాగివుంటుందని,  ప్రస్తుత రోజుల్లో అభాగ్యులకు అండగా నిలవడం  ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి అన్నారు. మారుమూల గమాల్లో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయంమని ప్రసంసించారు.అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ..ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేదలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు,పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram