అనుమానితుల సమాచారం ఇద్దాం పోలీస్ శాఖకు సహకరిద్దాం
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం :కరకగూడెం మండలంలోని వలస ఆదివాసి గ్రామాలైన రేగళ్ళ,పడిగపూరం,అంగోరుగూడెం,నిమ్మగూడెం,కొత్తురు,నీలద్రిపేట అశ్వపూరంపాడు గ్రామాలలో మావోయిస్టులు వ్యతిరేకంగా వెలసిన వాలు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయ మహిళ దినోత్సవానికి రెండు రోజుల ముందు వాల్ పోస్టర్లు ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో వెలవడంతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి. శాంతియుత జీవనం మన హక్కు అనుమానితుల సమాచారం పోలీస్లకు ఇచ్చి పోలీస్ శాఖకు సహకరిద్దాం మావోయిస్టులు వద్దు అభివృద్ధి ముద్దు అంటూ బుధవారం రాత్రి వాల్ పోస్టర్లు వెలిశాయి. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న వలస ఆదివాసీ గ్రామాలలో ఒక్కసారిగా మావోయిస్టులకు వ్యతిరేకంగా ట్రైబల్ పేరుతో వాలు పోస్టర్లు వేలవడంతో వాలస ఆదివాసీ గ్రామప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. మావోయిస్టు దళం చెర నుండి మహిళల విముక్తికై పోరాడుదాం మావోయిస్టు దళంలో మహిళలపై లింగ వివక్షకు అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుదాం దళంలో మహిళలతో వంటపని బ్యాగులు మోత నాయకుల వ్యక్తిగత పనులకి బానిసలుగా చూసే పద్ధతి నుండి విముక్తికై పోరాడుదాం మహిళా రిజర్వేషన్ ఉపయోగించుకుని మనమే పాలకులుగా మారుదాం మాయదారి మావోయిస్టులను తరిమికొడదాం !
ఆదివాసి మహిళాభివృద్ధికి తోడ్పడదాం !! అంటూ కరపత్రాల్లో పేల్కొన్నారు.









