గోల్డెన్ న్యూస్ /నల్గొండ: ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది.
తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్ ను హత్య చేయించాడు . కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం.. విచారణ పూర్తి చేసి.. ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగింది.. ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు…2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
Post Views: 51









