గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి

గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి బాలిక అనుమానాస్పద మృతి – విద్యావ్యవస్థల పై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నేల రాలుతున్న పసి ప్రాణాలు

గోల్డెన్ న్యూస్/ ఆదిలాబాద్ : ఇచ్చోడ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని మృతి చెందింది.బజారత్నూర్ మండలం మొర్కండి గ్రామానికి చెందిన లాలిత్య గిరిజన ఆశ్రమ పాఠశాలలో  చదువుతోంది. లాలిత్య అనారోగ్య కారణాలతో సోమవారం మృతి చెందింది. లాలిత్య అనారోగ్యం పై తమకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . బోథ్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని శివ పరీక్ష కోసం బోథ్ ఆసుపత్రికి తరలించారు . కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాదిత కుటుంబాన్ని అదుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram