ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

 

గోల్డ్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు శంకుస్థాపన జరిగింది. నిధులు మంజూరైన గ్రామాల్లో అంతర్గత పనులకు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య శంకుస్థాపన చేసి ప్రారంభించారు. మూడు కోట్ల రూపాయలతో మండలంలో పలు గ్రామాల్లో రహదారుల శంకుస్థాపనల్లో ఆయన పాల్గొననున్నారు. బొజ్జయిగూడెం, రాగబోయిన గూడెం, ఇందిరానగర్, మామిడి గుండాల, చల్లాసముద్రం, ఒడ్డుగూడెం పంచాయతీలలో జరగనున్న అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనున్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram