గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం మండలం రేగళ్ల గ్రామపంచాయతీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సోమవారం భూమి పూజ చేశారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన నిరుపేదలందరికీ 5 లక్షలతో పక్కా ఇండ్లను ప్రభుత్వం నిర్మించడానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకు వరంగా మారనుందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తుందని ఆయన అన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post Views: 94









