కూలి పని చేసుకునే వ్యక్తికి రూ.22.86 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసు..

గోల్డ్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం: చంద్రుగొండ రూ.22,86,014 జిఎస్టి డబ్బులు  చెల్లించాలంటూ  మండల కేంద్రానికి చెందిన ఓ నిరుపేద కూలీ జానపాటి వెంకటేశ్వర్లుకు విజయవాడలోని కమర్షియల్ టాక్స్ కార్యాలయ అసిస్టెంట్ కమిషనర్ నుంచి నోటీసు పంపించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2022లో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరిట రూ.కోటి మేర గ్రానైట్ వ్యాపారం చేశారని, అందుకు సంబంధించిన జీఎస్టీ చెల్లించలేదని నోటీసులో ప్రస్తావించారు. ఈ నెల 4న నోటీసు అందుకున్న వెంకటేశ్వర్లు.. విజయవాడలోని సదరు చిరునామాకు బుధవారం వెళ్లగా అక్కడ భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ కార్యాలయం లేదని తెలిపారు. తనకు తెలియకుండా వ్యాపార లైసెన్స్ ఎలా వచ్చిందని అతడు వాపోతున్నారు. 2022 సంవత్సరంలో తనకు పాన్   కార్డు లేదని ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. వెంకటేశ్వర్లుకు తెలియకుండా అతడి ఆధార్ కార్డును ఎవరో  సంపాదించి దాని ద్వారా పాన్కార్డు పొంది 2022లో గ్రానైట్ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు జీఎస్టీ నోటీసు రావటం ఏమిటని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Facebook
WhatsApp
Twitter
Telegram