శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయం

 శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం మండలం సమత్  బట్టుపల్లి పంచాయితీలోని  బుర్ధారం అటవీ ప్రాంతంలో వెలసియున్న శ్రీ జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామి వారిని హోలీ పండగ సందర్భంగా శుక్రవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని నరసింహ స్వామిని కోరుకున్నానని పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్బాల్ హుస్సేన్, పోలె బోయిన తిరుపతయ్య, శ్రీవాణి, ఎర్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram