గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడె : అశ్వాపురం మండలం మొండికుంట కుర్వపల్లి కొత్తూరు సమీప అడవిలోని గుట్టపై మంటలు చెలరేగాయి. ఎవరో గుర్తు తెలియని దుండగులు అడవికి నిప్పు పెట్టారని సమాచారం. గత మూడు రోజులుగా అడవి తగలబడుతూనే ఉంది. గుట్టపై మూడు వైపులా దుండగులు నిప్పు పెట్టడంతో చిన్న చెట్లు, ఆకులు అన్నీ ఆహుతి అవుతున్నాయి. మంటలు ఏగసి పడుతుండడంతో. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అశ్వాపురం ఎస్ఆర్ ఎస్. రమేష్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎఫ్ ఆర్ ఓ మాట్లాడుతూ.. మంటలను అదుపులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
Post Views: 50









