ఆకాశవాణి కొత్తగూడెం యువ వాణి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు

గోల్డెన్ న్యూస్/  భద్రాద్రి కొత్తగూడెం : పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ అటానమస్ హిందీ విభాగం విద్యార్థులు బుధవారం ఆకాశవాణి కొత్తగూడెం యువ వాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.  షేక్ రేష్మ బీకాం థర్డ్ ఇయర్ మహిళల హక్కులు,చట్టాలు అనే అంశంపై మాట్లాడారు. మహిళల హక్కులను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సమాజంలో లింగ వివక్షను కాపాడవచ్చునని, మహిళలు తమ హక్కులను తెలుసుకోవడం ద్వారా శక్తివంతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చునని తెలియజేశారు. అనంతరం ఎస్ లావణ్య బి జెడ్ సి థర్డ్ ఇయర్ హిందీ మహిళా సాహిత్యకారులు అనే అంశంపై మాట్లాదారు. మహిళా రచయితలు సమాజంలోని మహిళల వివిధ సమస్యలను, జీవితాలను, భావోద్వేగాలను తమ రచనల ద్వారా తెలియజేసి మహిళలను చైతన్యవంతులను చేసినారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన హిందీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి అరుణ కుమారి, సహనాజ్ లను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి పద్మ మరియు ఇతర అధ్యాపక బృందం అభినందించినారు

Facebook
WhatsApp
Twitter
Telegram