గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం మండలం సమపత్ బట్టుపల్లి పంచాయతీలోనికుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జుగుణమ్మ బ్యాంకు ఖాతాలో ఉన్న 28000 రూపాయలు పొరపాటున వేరే అకౌంట్లో పడి చాలా రోజులు అయింది.బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడింది. ఈ విషయంపై రెండు రోజుల క్రితం కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎస్ఐ రాజేందర్ సంబంధిత బ్యాంక్ అధికారులతో మాట్లాడి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా డబ్బును రికవరీ చేశారు. గురువారం బాధితురాలు జుగుణమ్మ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా జుగుణమ్మ ఎస్సై , సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసింది.
Post Views: 89









