ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా…

గోల్డెన్ న్యూస్/ కామారెడ్డి : ప్రేమించి గర్భవతిని చేసి.. ఇప్పుడు మొఖం చాటేశాడు తనను ప్రేమించి నాలుగు సంవత్సరాలు తనతో కాపురం చేసి మోసం చేశాడని భర్త ఇంటి ముందు యువతి ధర్నాకు దిగింది. తన కులం తక్కువ అని తనను నడిరోడ్డులో వదిలేశాడని యువతి ఆలోచించింది.

యువతి తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా  లింగంపేట్ మండలం కోమట్పల్లి గ్రామం కేశయపేట కు చెందిన, నెల్లూరి భాగ్య, ( 23)  అదే గ్రామానికి చెందిన సిటురి రాకేష్( 23) వీరిద్దరూ హైదరాబాద్ లో గత నాలుగు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నట్లు యువతి తెలిపారు. యువతి ఆరు నెలల గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న రాకేష్  హైదరాబాద్ లోనే నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స చేయించి, గర్భాన్ని తొలగించినట్లు యువతి నెల్లూరు భాగ్య తెలిపారు. రాకేష్ ఇంటి ముందు శుక్రవారం కుటుంబ సభ్యులతో ఆమె తన భర్త కావాలని, న్యాయం జరిగే వరకు తన భర్త ఇంటిముందే ధర్నా చేస్తానని మోరాయించింది. గతంలో కూడా లింగంపేట పోలీస్ స్టేషన్ లో రెండుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ.. తన భర్త నమ్మబలికించి ఇంటికి తాళం వేసుకొని పారిపోయినట్లు ఆమె తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు ఎక్కడికి వెళ్లనని ఆమె తెలిపింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram