గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : ఇంటి ముందు నిలిపి ఉంచిన రెండు కార్లకు దుండగులు నిప్పంటించిన ఘటన రామవరం ఎస్సీబీ నగర్ లో మంగళవారం చోటుచేసుకుంది. 20 టౌన్ పోలీసుల కథనం ప్రకారం… ఎస్సీబీ నగర్ స్వర్ణభారతి స్కూల్ సమీపంలో కార్లు దగ్ధమవుతుండటాన్ని గమనించిన సింగరేణి మాజీ ఉద్యోగి జీకే. సంపత్ కుమార్, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే రెండు కార్లు పూర్తిగా దహనమయ్యాయి. పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి ఘటనకు ముందు జరిగిన సీసీ కెమెరాల పుటేజ్ లను పరిశీలించగా ఆ ప్రాంతంలో ఇద్ద వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినా ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్ధారణ కాలేదు. సింగరేణి సంస్థపై గతంలో తాను వేసిన కేసుకు సంబంధించి అదే సంస్థకు చెందిన వ్యక్తులు తనపై కక్ష పూరితంగా వ్యవహరించారని సంపత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ కేసు విషయంలో బుధవారం హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా తనను భయటపెట్టేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ కొనసాగిస్తున్న పోలీసులు.









