వైద్యం వికటించి మహిళా మృతి.

గోల్డెన్ న్యూస్/వరంగల్ : వైద్యం వికటించి మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది.  మృతురాలి బంధువుల కథనం మేరకు.. ధర్మసాగర్ కు చెందిన ఎస్.అరుణ అనే మహిళ మంగళవారం కిడ్నీ, గర్భసంచి సమస్యలతో చికిత్స కోసం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం ముందు ఉన్న ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేసిన తర్వాత తీవ్రమైన రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను ములుగు క్రాస్ రోడ్లోని ఒక ప్రైవేట్ కార్పొరేట్  ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం  ఆమె మృతి చెందింది .మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తమకు న్యాయం చేయాలని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళనలో మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త శ్రీనివాస్ స్థానికంగా చిరు వ్యాపారి. అరుణ మృతితో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

Facebook
WhatsApp
Twitter
Telegram