పండగపూట విషాదం.

గోల్డెన్ న్యూస్ / కామారెడ్డి :  చెరువులో మునిగి తల్లి, ముగ్గురు పిల్లలు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది.

♦ ఎల్లారెడ్డి  మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆ దివారం ఉదయం చెరువు వద్ద తల్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా.. చిన్నారులు ముగ్గురూ స్నానానికి దిగారు. చెరువులో భారీ గుంత ఉండటంతో అందులో పడి మునిగిపోయారు. చిన్నారులను కాపాడేందుకు తల్లి యత్నించింది. ఈ క్రమంలో తల్లితో పాటు పిల్లలు ముగ్గురూ చెరువులో మునిగి చనిపోయారు.మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్ గుర్తించారు. తల్లి, పిల్లలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram