రేపే రంజాన్‌..

 నేడు పశ్చిమాసియా దేశాల్లో పండుగ

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌ : భారతదేశంలో రంజాన్‌ పండుగ (ఈదుల్‌ ఫితర్‌) సోమవారం జరగనుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాతో పాటు పలు పశ్చిమాసియా దేశాల్లో ఆదివారం పండుగను జరుపుకుంటున్నారు.

దాంతో భారతదేశంలో సోమవారం పండుగను చేసుకోనున్నారు. ఈ నెల 2వ తేదీన రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. దాంతో ఆదివారం రోజున చివరి ఉపవాసదీక్ష ఉండనుంది. ఇక రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మాసంలో రూ.800 కోట్ల హలీమ్‌ విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

 

హైదరాబాద్‌లో ఒక్క పిస్తాహౌ్‌సలోనే ప్రతిరోజు 2 వేల కిలోల హలీమ్‌ను విక్రయిస్తుండగా, మదీనాలోని షాదాబ్‌, మాసాబ్‌ట్యాంక్‌లోని 555, మెహదీపట్నం, బంజారాహిల్స్‌లోని సర్వి, పాతబస్తీ, టోలిచౌకి, లక్డీకాపూల్‌, గచ్చిబౌలీ ప్రాంతాల్లోని షాగౌస్‌, మెహ్‌ఫిల్‌ వంటి రెస్టారెంట్లు సగటున రోజుకి 1000 నుంచి 1500 కిలోల దాకా హాలీమ్‌ అమ్ముతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 6వ తేదీ దాకా హాలీం విక్రయాలు జరగనున్నాయి. రంజాన్‌ మాసం ముగిసిన తర్వాత షవ్వాల్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ మాసం ప్రారంభంలో ఆరు రోజుల పాటు చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తారు. దాంతో వారి కోసం ఆరురోజుల పాటు ప్రత్యేకంగా హాలీం తయారుకానుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram