ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు
గోల్డెన్ న్యూస్/ విజయవాడ : ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారు. పరిధికి మించి అప్పులు చేస్తే అప్పులూ పుట్టని స్థితికి వస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేతలు పరిస్థితులను గమనించాలి. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు’ అని సూచించారు..
పార్టీల ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయ పార్టీల నేతలు వారి అజెండా ప్రాతిపదికన ఎన్నికలకు వెళ్లేవారని అన్నారు. ఇప్పుడు కేవలం కొంతమంది నాయకుల పేర్లతో వెళ్తున్నారని చెప్పారు. అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తామని చెప్పేవాళ్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు పార్టీలు మారడం బాగా అలవాటుగా మారిందన్నారు. పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రజాస్వామ్య విరుద్దం.. ఇటీవల మంచినీళ్లు తాగినంత ఈజీగా పార్టీ మారిపోతున్నారని వెంకయ్యనాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.









